![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -332 లో..... రామలక్ష్మి మైథిలీగా ఎలా మరాల్సి వచ్చిందో రామలక్ష్మి గుర్తు చేసుకుంటుంది. ఫణీంద్ర, సుశీల లు రామలక్ష్మిని ఉండమని చెప్తారు. నా భర్త దగ్గరికి వెళ్ళాలంటూ వెళ్తుంది. తనే మళ్ళీ ఇక్కడికి వస్తుందని సుశీలతో ఫణీంద్ర చెప్తాడు. రామలక్ష్మి నేరుగా స్వామి దగ్గరికి వెళ్తుంది. నా భర్త లేడు.. మీరు చెప్పినట్టు వినలేదని రామలక్ష్మి బాధపడుతుంది. నీ భర్త లేడని ఎవరు చెప్పారు.. బ్రతికే ఉన్నాడని స్వామి చెప్తాడు.
కానీ నువ్వు నీ భర్తతో కలిసి ఉండకూడదు.. దూరంగా ఉండాలని స్వామి చెప్పగానే రామలక్ష్మి షాక్ అవుతుంది. అలా అయితేనే నీ భర్త ప్రాణాలతో ఉంటాడు. నువ్వు ఎక్కడ ఉండాలో కూడా ఇది వరకే దారి చూపించాడు ఆ దేవుడు అని స్వామి అనగానే ఫణీంద్ర వాళ్ళు మాట్లాడిన విషయలు గుర్తు చేసుకుంటుంది రామలక్ష్మి. నువ్వు బ్రతికి ఉండగానే నీకు ఇంకొక జన్మ లభించిందని స్వామి చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వెళ్తుంది. దూరం నుండి చూసి సీతా సర్ నేను చనిపోయానన్న భ్రమ లో ఉన్నాడు అలాగే ఉండనివ్వాలని రామలక్ష్మి వెనక్కి తిరిగి వెళ్తుంది
ఆ తర్వాత ఫణీంద్ర, సుశీల దగ్గరికి తిరిగి వెళ్లడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు ఇన్ని రోజులు కోల్పోయింది ఇక నుండి నీ చుట్టూ వాళ్ళకు తిరిగి ఇవ్వమని రామలక్ష్మితో ఫణీంద్ర అంటాడు. ఇదంతా రామలక్ష్మి జరిగిందని గుర్తు చేసుకుంటుంది. మరొకవైపు సీతాకాంత్, రామ్ లు కోపంగా ఇంటికి వస్తారు. సీతాకాంత్ పైకి వెళ్తాడు. రామ్ కోపంగా అన్ని వస్తువులు విసిరేస్తాడు. ఏమైందని శ్రీలత అడుగుతుంది. మా ప్రిన్సిపల్ మేడమ్ నాన్న ని కొట్టిందనగానే శ్రీలత వాళ్ళు షాక్ అవుతారు. ఎందుకు కొట్టిందని శ్రీలత వాళ్లు అడుగ్గా.. ఏమో అని రామ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |